- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
'రజక సంఘం అభివృద్ధికి లక్ష రూపాయల విరాళం'

దిశ, కంటోన్మెంట్/బోయిన్ పల్లి: కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న రజక సంఘం అభివృద్ధికి తన వంతు సహాయంగా లక్ష రూపాయలు సొంత నిధులను అందిస్తున్నాను అని తెలంగాణ మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ క్రిశాంక్ ప్రకటించారు. చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని కంటోన్మెంట్ పరిధిలోని ధోభి ఘాట్ వద్ద చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద కంటోన్మెంట్ రజక సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. అనంతరం క్రిశాంక్ మాట్లాడుతూ.. కంటోన్మెంట్ ప్రాంతంలోని రజక సంఘం కోసం తాను ఎల్లప్పుడు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. దీనికోసం తన సొంత నిధుల నుండి లక్ష రూపాయలు విరాళం అందిస్తున్నట్టు సభాముఖంగా ప్రకటించారు.
ఈ సందర్భంగా రజక సంఘం సభ్యులు ఆయనను అభినందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సాయన్న తెలంగాణ మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ క్రిశాంక్, గజ్జెల నగేష్, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాద్యక్షుడు జంపన ప్రతాప్, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.