- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కాళేశ్వరం ప్రాజెక్టుపై టెక్నికల్ కమిటీ వేయాలి: తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం డిమాండ్

దిశ ఖైరతాబాద్: సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఈరోజు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జై కిసాన్ చైర్మన్, మాజీ మంత్రి కోదండ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే తెలంగాణ బాగుపడాలని రిటైర్డ్ ఉద్యోగులు, రాజకీయ నాయకులు కలిసి ఏర్పాటు చేసిన ఫోరమ్ ఈ తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరమ్ అని అన్నారు. కాళేశ్వరం పాజెక్ట్ కోసం ఖర్చు చేసిన డబ్బు ఎంతని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినా.. ఎటువంటి సమాచారం ఇవ్వలేదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వెనుక వున్న పొలాలు అన్ని ముంపుకు గురి అయ్యాయని రైతులు వాపోతున్నారు.
దాదాపు లక్షా 25 కోట్లు వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు 18 లక్షల ఎకరాలకు నీటిని అందిస్తుందని అనుకుంటే.. కేవలం 50 వేల ఎకరాలకు మాత్రమే సరఫరా అవుతుందని.. అది కూడా అవసరం లేకుండా విపరీతంగా కురిసిన వర్షాలతో అవసరాలు తీరి రైతులకు ముంపుతో నష్టం వాటిల్లింది అని అన్నారు. ప్రభుత్వం నిర్మించిన ఈ ప్రాజెక్టు ఏ విధంగా కూడా రైతులకు ఉపయోగపడలేదని.. ఒక రైతుగా ఉన్న తనకు చాలా బాధగా ఉందని అన్నారు. వాతావరణ పరిస్థితుల ప్రకారం కాళేశ్వర ప్రాజెక్టుకి సంబందించి విద్యుత్ సరఫరా, పంపిణీ, సాంకేతికంగా వున్న సమస్యల మీద నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.
మొత్తం ఖర్చులెన్ని? అప్పు ఎంత? సాంకేతికంగా ఆమోదం తెలిపి రుణాలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుని స్వయంగా సమీక్షించాలని.. ప్రజలపై పడే బారం తగ్గించేందుకు మేము పాటు పడతాం అని అన్నారు. ఇక దీనిపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కాలేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి టెక్నికల్ కమిటీ వేయాలని తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరమ్ డిమాండ్ చేస్తుంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కోదండ రెడ్డి, టీ.డి.ఎఫ్ చైర్మన్ రణధీర్, డి.పి.రెడ్డి, బి.వి.రావు, వెంకట్ గొన రెడ్డి, రాజారెడ్డి వట్టే, అంజన త్రివేణి తదితరులు పాల్గొన్నారు.