- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పెంచిన ఫీజులు వెనక్కి తీసుకోవాలి.. విద్యార్థి సంఘాల డిమాండ్

దిశ, తెలంగాణ బ్యూరో: జవహర్‌లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో పెంచిన ఫీజులు వెనక్కి తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. సోమవారం హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లోని జేఎన్ఎఫ్‌ఏయూ వైస్ చాన్స్‌లర్ కవితా ధర్యాని, ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ వి వెంకట రమణకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ.. జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ లో ఈ సంవత్సరం పెయింటింగ్, ఫోటోగ్రఫీ, యానిమేషన్, అప్లైడ్ ఆర్ట్, ఇంటీరియర్ డిజైన్ సంబంధించిన కోర్సులకి 60 శాతం ఫీజులు పెంచారని తెలిపారు.
దీంతో చాలా మంది పేద, మధ్యతరగతి విద్యార్థులు ఈ కోర్సుల్లో చదువుకోవడానికి ముందుకు రావడం లేదన్నారు. ఆర్ట్స్‌కు సంబంధించిన స్టూడెంట్స్ టెక్నికల్ సంబంధించిన స్టూడెంట్స్ మారుమూల గ్రామాల నుంచి చదువుకోవాలని వస్తే, ఈ ఫీజులు పెంచడం వల్ల విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని, కాబట్టి ఫీజులు తగ్గించి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు అశోక్, ఏఐఎస్ఎఫ్ నాయకులు స్టాలిన్, లక్ష్మణ్, ఎస్ఎస్‌యూ నాయకులు గోపి, భరత్, మని, టోని, సాంబశివ తదితరులు పాల్గొన్నారు.