విద్యార్థులు లక్ష్యసాధనతో ముందుకు సాగాలి.. ఎమ్మెల్సీ బండ ప్రకాష్

by Hamsa |
విద్యార్థులు లక్ష్యసాధనతో  ముందుకు సాగాలి.. ఎమ్మెల్సీ బండ ప్రకాష్
X

దిశ, అంబర్ పేట్: విద్యార్థులు లక్ష్య సాధనతో ముందుకు వెళ్లాలని ఎమ్మెల్సీ బండ ప్రకాష్ అన్నారు. తెలంగాణ ముదిరాజ్ సేవా సంఘం ఆధ్వర్యంలో విద్యలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతిభా రాజ్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఆదివారం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బండ ప్రకాష్ మాట్లాడుతూ.. విద్యార్థులకు చెడు అలవాట్లకు గురి కాకుండా తమ లక్ష్యసాధనకు కృషి చేయాలన్నారు. ముదిరాజ్ విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1 ర్యాంకులలో విజయం సాధించాలని ఆకాంక్షించారు.

తెలంగాణ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు డాక్టర్ పడిగే యాదగిరి ముదిరాజ్ మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివినప్పుడే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని తెలిపారు. విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని ప్రతిభ పురస్కారాలను అందుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం పోస్ట్ గ్రాడ్యుయేట్స్ సాధించిన సునీత ముదిరాజ్ ను ఘనంగా సన్మానించారు. విద్యార్థులకు ప్రతిభా రాజ్ అవార్డులతో ఐదువేల చెక్కులను పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ సంఘం చైర్మన్ కాశీబోయిన అనంతరాములు ముదిరాజ్, సమన్వయకర్త వీ. నారాయణ ముదిరాజ్, వెంకటేష్ ముదిరాజ్, సీనియర్ జర్నలిస్ట్ మహమ్మద్ షరీఫ్, ప్రముఖ సంఖ్యాశాస్త్ర నిపుణుడు దైవజ్ఞ శర్మ పాల్గొన్నారు.



Next Story