ఓయూలో మళ్లీ టెన్షన్.. విద్యార్థి నాయకులు అరెస్ట్

by Sathputhe Rajesh |   ( Updated:2022-05-04 08:57:28.0  )
ఓయూలో మళ్లీ టెన్షన్.. విద్యార్థి నాయకులు అరెస్ట్
X

దిశ, సికింద్రాబాద్: రాహుల్ గాంధీ ఓయూ పర్యటన నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాహుల్ గాంధీ ఓయూ పర్యటనకు అనుమతించాలని డిమాండ్ చేస్తూ బుదవారం నిరుద్యోగ ఫ్రంట్, కాంగ్రెస్ నాయకులు ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ ప్రారంభంలోనే అడ్డుకున్న పోలీసులు వారిని అరెస్టు చేసి అంబర్ పేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్బంగా నిరుద్యోగ ఫ్రంట్ చైర్మన్ చెనాగాని దయాకర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యబద్దంగా శాంతి ర్యాలీ చేపడిటే కక్ష్య కట్టి అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం అన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఓయూ పర్యటనకు అనుమతి ఇవ్వాలన్నారు. టీఅర్‌ఎస్ నాయకులు, ఓయూ అధికారులు నియంత పోకడలతో పరిపాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. అధికార పార్టీ నాయకుల ప్రోగ్రాంలకు అనుమతి ఇస్తున్న అధికారులు.. రాహుల్ రాకకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రాహుల్ ఓయూ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం, ఓయూ అధికారులు ఎందుకు భయపడుతున్నారో తెలపాలన్నారు. రాహుల్ గాందీ ఓయూకు వచ్చి తీరుతారన్నారు.


రాహుల్ ఓయూ రాకకు వామపక్ష విద్యార్ది నాయకుల మద్దతు

అటు రాహుల్ గాంధీ ఓయూ పర్యటనకు అనుమతించాలని వామపక్ష విద్యార్ది సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అనేక ఉద్యమాలకు, రాజకీయ చర్చలకు వేదికగా చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీలో భిన్న అభిప్రాయాలు కలిగిన వారు ఉన్నారు. ఓయూకు ఎవరైనా రావచ్చు, అందరినీ స్వాగతిస్తాం అన్నారు. ఓయూ లో రాష్ట్ర ప్రభుత్వం , ఓయూ అధికారులు ప్రజాస్వామ్యాన్ని పాతరేసి పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. అరెస్టులతో ప్రశ్నించే గొంతులను నిక్కాలని చూస్తే తెలంగాణ ఉద్యమ తరహాలో టీ అర్ ఎస్ సర్కారు విద్యార్ది ఉద్యమాలను చవి చూడాల్సి ఉంటుందన్నారు.





Next Story

Most Viewed