ఐటీసీ కోహినూర్ వద్ద స్ట్రీట్ వెండర్స్ ఆందోళన..

by Sumithra |   ( Updated:2024-11-07 09:11:31.0  )
ఐటీసీ కోహినూర్ వద్ద స్ట్రీట్ వెండర్స్ ఆందోళన..
X

దిశ, శేరిలింగంపల్లి : పొట్టచేత పట్టుకుని రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్స్ పెట్టుకుని జీవనం సాగిస్తున్న తమను ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది ఇబ్బందులకు గురి చేస్తున్నారని మాదాపూర్ లో స్ట్రీట్ వెండర్స్ లు ఆవేదన వ్యక్తం చేశారు. మాదాపూర్ ఐటీసీ కోహినూర్ సమీపంలో ఫుట్ పాత్ మీద ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్న స్ట్రీట్ వెండర్స్ గురువారం కోహినూర్ హోటల్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాలా కాలంగా ఇక్కడే ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నామని అయితే జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు తమను తరచూ ఇబ్బందుల పాలు చేస్తున్నారని అన్నారు.

ఇక్కడే ఫుడ్ స్టాల్స్ పెట్టుకున్న కొందరికి కొమ్ముకాస్తున్న అధికారులు తమ పై మాత్రం జులుం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి కుమారీ ఆంటీ విషయంలో అక్కడ ఫుడ్ స్టాల్స్ అన్నిటికీ పర్మిషన్ ఇచ్చారని, కానీ ఇప్పుడు అక్కడ ఉన్న కొన్ని సంస్థలు, జీహెచ్ఎంసీ, పోలీసుల సహాయంతో వాటిని తొలగించారన్నారు. తమకు న్యాయం చేయాలని స్ట్రీట్ వెండర్స్ నిరసన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed