కలెక్షన్ కింగ్స్.. రోజుకు రూ. లక్ష నుండి 2 లక్షలు లేనిదే ఇంటికి వెళ్లని అధికారులు?

by Dishanational1 |
కలెక్షన్ కింగ్స్.. రోజుకు రూ. లక్ష నుండి 2 లక్షలు లేనిదే ఇంటికి వెళ్లని అధికారులు?
X

జీహెచ్ఎంసీ ఎల్బీనగర్ ఈస్ట్ జోన్ పరిధిలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి రాజ్యమేలుతుంది. వందలాది అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడమే ఇందుకు నిదర్శనం. అక్రమ నిర్మాణాలను గుర్తించాల్సిన చైన్ మెన్లను టౌన్ ప్లానింగ్ అధికారులు ఉత్సహ విగ్రహాలను చేశారు. అక్రమ వసూళ్ల కోసం జోనల్ కమిషనర్ బాటలోనే అసిస్టెంట్ సిటీ ప్లానర్(ఏసీపీ)లు ఇద్దరు పీఏలను నియమించుకున్నారు. అంతేకాకుండా అక్రమ నిర్మాణాల వద్దకు వెళ్ళినప్పుడు ఇబ్బందులు తలెత్తకుండా వారికి నకిలీ ఐడీ కార్డులు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. అక్రమ నిర్మాణాలను గుర్తించడం వసూలు చేయడమే వీరి విధిగా ఉన్నట్లుగా తెలుస్తుంది. విధుల్లో పారదర్శకతను పక్కనపెడితే రోజువారీ లంచాల టార్గెట్ తో ఇక్కడి అధికారులు పనులు చేస్తారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. ఇందులో జోనల్ కమిషనర్ కు వాటా అందుతుండడంతోనే దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదని అధికారుల్లోనే గుసగుసలు వినపడుతున్నాయి.

దిశ, ఎల్బీనగర్: ఎల్బీనగర్ ఈస్ట్ జోనల్ పరిధిలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో ప్రైవేటు సైన్యం రాజ్యమేలుతుంది. నిబంధనలకు.. విరుద్ధంగా టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రైవేటు వ్యక్తులను నియమించుకుని అక్రమ నిర్మాణదాల నుండి వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జోనల్ కమిషనర్ తరహాలోని ఒక్కో టౌన్ ప్లానింగ్ అధికారి ఇద్దరు ప్రైవేటు పీఏలను నియమించుకోవడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. జీహెచ్ఎంసీ ఈస్ట్ జోన్ టౌన్ ప్లానింగ్ విభాగంలో ఔట్ ఉద్యోగులు చైన్ మెన్లుగా విధులు నిర్వహిస్తున్నారు. వీరు అక్రమ నిర్మాణాలను గుర్తించి టౌన్ ప్లానింగ్ అధికారులకు తెలియజేయాలి. కానీ వీరిపై నమ్మకం లేని అధికారులు ప్రైవేట్ వ్యక్తులను నియమించుకుని పనులు చక్కబెట్టుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఈ భాగోతం అంతా ఆయా సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లకు తెలిసే జరుగుతుందన్న వాదనలు ఉన్నాయి. తిలాపాపం.. తలా పిడికెడు.. అన్నట్లుగా అధికారుల తీరు ఉందని పలువురు ఆరోపిస్తున్నారు.

సర్కిల్ -5 లో..

ఎల్బీనగర్ జోనల్ పరిధిలోని సరూర్ నగర్ సర్కిల్-5 అసిస్టెంట్ సిటీ ప్లానర్(ఏసీపీ) ఓ ప్రైవేట్ వ్యక్తిని నియమించుకుని అక్రమ నిర్మాణదారుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ ప్రైవేట్ వ్యక్తికి నకిలీ ఐడీ కార్డు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎక్కడ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతామోనన్ను భయంతో ఈ అధికారి అలా తెలివితో తన పని చేసుకోపోతున్నట్లు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

సర్కిల్ - 3లో..

ఇక హయత్ నగర్ సర్కిల్-3 డిప్యూటీ సిటీ ప్లానర్(డీసీపీ) ఓ ఔట్ సోర్సింగ్ వ్యక్తిని తన పీఏగా నియమించుకుని తన పనులు చక్కబెట్టుకుంటున్నారు. గతంలో ఈ వ్యక్తి అదే సర్కిల్ పరిధిలో చైన్ మెన్ గా వ్యవహరించాడు. అయితే అతడు పాతబస్తీలో పని చేసిన అనుభవం ఉండడంతో అక్రమ నిర్మాణదారులను భయభ్రాంతులకు గురిచేసి పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడతాడనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో సర్కిల్ -5 డీసీపీ ఏరి కోరి అతడినే తన పీఏగా నియమించుకున్నట్లు తెలుస్తోంది. అయితే సదరు అధికారిని ప్రతి పనికి రూల్స్ చెప్తుంటారు. కానీ ఆమె నిజరూపం మరోలా ఉంటుందని ఆరోపణలు ఉన్నాయి. ఇక ఎల్బీనగర్ జోనల్ పరిధిలోని టౌన్ ప్లానింగ్ అధికారులు రోజు రూ. లక్ష నుండి రూ. 2 లక్షలు లేనిదే ఇంటికి వెళ్లారనే చర్చ లేకపోలేదు.


Next Story

Most Viewed