'విద్యార్థులు చిన్ననాటి నుండే రాజ్యాంగం, మానవ హక్కులపై అవగాహన పెంచుకోవాలి'

by Dishanational1 |
విద్యార్థులు చిన్ననాటి నుండే రాజ్యాంగం, మానవ హక్కులపై అవగాహన పెంచుకోవాలి
X

దిశ ప్రతినిధి ,హైదరాబాద్: విద్యార్థులు చిన్ననాటి నుంచి భారత రాజ్యాంగం, మానవ హక్కులపై అవగాహన పెంచుకోవాలని హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ బి. చంద్రకుమార్ అన్నారు. తెలంగాణ మేధావుల ఫోరం, నిజాం కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్స్ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజాం కళాశాల సెంటినరీ బ్లాక్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఐక్యరాజ్యసమితి 1948 డిసెంబర్ 10న మానవ హక్కుల పరిరక్షించాడడానికి డిక్లరేషన్ చేసిందన్నారు. మనిషికి ప్రపంచంలో జీవించే హక్కు కావాలని, ఒకరి దయా దాక్షిణ్యాలపై బ్రతికే బతుకు వద్దన్నారు.

నల్సర్ లా యూనివర్సిటీ రిజిస్టర్ ప్రొఫెసర్ వి. బాలకృష్ణారెడ్డి ప్రసంగిస్తూ నేటి సమాజంలోని నివసిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రాథమిక హక్కులు ఉంటాయని, వాటి ఉల్లంఘన జరిగినప్పుడు తమ హక్కులను కాపాడుకోవడానికి వారు మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయిస్తారన్నారు. ప్రస్తుతం సమాజంలో ప్రతి ఒక్కరికి గౌరవంగా పూర్తి స్వేచ్ఛతో జీవించే హక్కు ఉందన్నారు. నిజాం కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బీమా బుఖ్య మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రపంచంలోనే ఆదర్శవంతమైందని, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా భారతదేశంలో ప్రజాస్వామ్యం విరాజిల్లుతోందని అన్నారు. ఈ సదస్సులో తెలంగాణ మేధావుల ఫోరం రాష్ట్ర చైర్మన్ డాక్టర్ ఎం రాజ్ నారాయణ ముదిరాజ్, ఉస్మానియా యూనివర్సిటీ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ మొహమ్మద్ అక్బర్ అలీ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సిహెచ్ వెంకటేశ్వర్లు, డాక్టర్ ఎం ధనంజయ నాయక్, డాక్టర్ రవితేజ చౌహన్, లయన్ ప్రేంచంద్ మనోజ్ జైన్, డాక్టర్ ఎ మంజుల, ఠాగూర్ గజానంద్ సింగ్, రాజేష్దుత్త అవస్తి, కుమారి సుచిత్ర చౌహన్, రాజేందర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed