కామన్ వెల్త్ పార్లమెంటరీ సదస్సుకు స్పీకర్, మండలి చైర్మన్

by srinivas |   ( Updated:2024-10-30 15:44:00.0  )
కామన్ వెల్త్ పార్లమెంటరీ సదస్సుకు స్పీకర్, మండలి చైర్మన్
X

దిశ, తెలంగాణ బ్యూరో : కామన్ వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ (సీపీసీ) సదస్సుకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనమండలి వైస్ ఛైర్మన్ బండ ప్రకాశ్, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు హాజరుకానున్నారు. ఆస్ట్రేలియా దేశంలోని సిడ్ని నగరంలో 67వ సీపీసీ ని నవంబర్ 3 నుంచి 8 వరకు నిర్వహించనున్నారు. ఈ సదస్సు కోసం ఈ నెల 2న మన రాష్ట్రం నుంచి స్పీకర్, చైర్మన్, డిప్యూటీ చైర్మన్, అసెంబ్లీ కార్యదర్శి బయలుదేరి వెళ్లనున్నారు. భారతదేశంతో పాటుగా ప్రపంచంలోని వివిధ దేశాల చట్టసభల ప్రిసైడింగ్ అధికారులను ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఈ సదస్సు అనంతరం కామన్ వెల్త్ పార్లమెంటరీ సదస్సులో ప్రతి సంవత్సరం వివిధ దేశాల్లో నిర్వహిస్తుంటారు. ఈ సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా చట్టసభలు జరుగుతున్న చర్చలు జరుగుతున్న తీరుపై చర్చిస్తారు. దీనితో పాటుగా ఇదే సదస్సులో 8వ ఉమెన్ పార్లమెంటేరియన్స్ సదస్సు జరగనుంది. 2024 కామన్ వెల్త్ పార్లమెంటేరియన్ అవార్డులను ప్రధానం చేస్తారు. సదస్సు అనంతరం యూరప్ లో పర్యటించి నవంబర్ 16న రాష్ట్రానికి చేరుకుంటారు.

Advertisement

Next Story

Most Viewed