- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
జనాభా గణన సెన్సెస్‌లో బీసీల అంశాన్ని చేర్చాలి: పరికిపండ్ల అశోక్

దిశ, సికింద్రాబాద్: జనాభా గణన సెన్సెస్‌లో బీసీల అంశాన్ని చేర్చాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం వారాసిగూడ చౌరస్తాలో బిలో పావర్టి లైన్ (బీపీఎల్) పార్టీ బొమ్మ వద్ద నరేందర్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రికి కోటి ఉత్తరాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రముఖ సామాజిక వేత్త డాక్టర్ పరికిపండ్ల అశోక్ ఆధ్వర్యంలో జనాభా గణన సెన్సెస్‌లో బీసీల అంశాన్ని చేర్చాలని దేశవ్యాప్త కోటి ఉత్తరాల ఉద్యమాన్ని చేపట్టారు. ప్రజలు, స్థానికులచేత ప్రధానమంత్రికి ఉత్తరాలు రాయించి పోస్ట్ డబ్బాలో వేయించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ పరికిపండ్ల అశోక్ హాజరై మాట్లాడారు. బీసీల లెక్క తేలితేనే రాజ్యాంగపరంగా మాకు రావాల్సిన హక్కు వస్తుందన్నారు. అందుకే ఒక సామాజిక బాధ్యతగా, ఉద్యమ రూపంలో ప్రధానమంత్రికి బీసీల ఆవేదన తెలిపే విధంగా దేశవ్యాప్త కోటి ఉత్తరాల ఉద్యమాన్ని ప్రారంభించామన్నారు. రాజ్యాంగం ప్రకారం మేమెంతో మాకంత అనే నినాదాన్ని బలంగా వినిపిస్తున్నామన్నారు.
బీసీలు అంటే రాజకీయ పార్టీలకు చులకన అయిపోయిందన్నారు. బీసీల కుల గణన అంశంపై ప్రతి ఒక్క బీసీ బిడ్డ ముందుకు వచ్చి సంఘటితంగా పోరాడాలని పిలుపనిచ్చారు. ఈ కార్యక్రమంలో జయరాజ్, బాలు, కృష్ణ, నర్సింహరావు, విద్యాసాగర్, సుధాకర్, రాజేంద్రప్రసాద్, ప్రభాకర్, జోసెఫ్, వీరేశం, రమణయ్య తదితరులు పాల్గొన్నారు.