షామీమ్ ఇంట్లో సిట్ సోదాలు

by Disha Web Desk 15 |
షామీమ్ ఇంట్లో సిట్ సోదాలు
X

దిశ, వనస్థలిపురం : గ్రూప్ 1పేపర్ లీకేజీ పై సిట్ అధికారుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ కేసులో A10గా ఉన్న షామీమ్ ను సిట్ అధికారులు గురువారం విచారించారు. గురువారం మధ్యాహ్నం 4 గంటల సమయంలో ఎల్బీ నగర్ గుంటి జంగయ్య నగర్ లో ఉన్న రామ్ అవెన్య్స్ అపార్ట్మెంట్ లో ఉండే షామీమ్ నివాసానికి ఆమెను తీసుకువచ్చిన సిట్ అధికారులు సుమారు గంట పాటు ఇంట్లో సోదాలు చేశారు. ప్రశ్నాపత్రం లీకేజీ తరువాత ఇంటి నుండి షామీమ్ ఎవరెవరితో మాట్లాడింది...?

సురేష్ ,రమేష్ లు షమీమ్ ఇంటికి ఎప్పుడు వచ్చారు అనే వివరాలను సిట్ అధికారులు సేకరించినట్లు సమాచారం. షమీమ్ నివాసంలో ప్రశ్నాపత్రాలకు సంబంధించిన కొన్ని ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా మనీ ట్రాన్సక్షన్ ఎంత వరకు కొనసాగింది అనే కోణంలో సిట్ అధికారులు సోదాలు చేశారు. ఆ తర్వాత హిమాయత్ నగర్ లో ఉన్న సిట్ కార్యాలయానికి షామీమ్ ను తరలించారు.



Next Story