గ్రేటర్ పరిధిలో ఆటో పర్మిట్లపై నిషేధాన్ని ఎత్తి వేయాలి: శాబంకర్ దయానంద్

by Seetharam |
గ్రేటర్ పరిధిలో ఆటో పర్మిట్లపై నిషేధాన్ని ఎత్తి వేయాలి: శాబంకర్ దయానంద్
X

దిశ, అంబర్ పేట్: కాలుష్యం తగ్గించే క్రమంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం 2002లో పెట్రోల్ డీజిల్, ఎల్పీజీ ఆథారిటీతో ఆటోలపైన నిషేధం విధించడంతో ఆటో డ్రైవర్లు ఉద్యోగ, ఉపాధిలేక ఇబ్బందుకు గురవుతున్నారని తెలంగాణ ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు శాబంకర్ దయానంద్, ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ కాలేద్‌లు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన గ్రేటర్‌లో లక్షలాది మంది ఉపాధి లేక నిరుద్యోగులుగా కుటుంబాలు రోడ్డు పాలయ్యారన్నారు.

ఎవరికి లేని రూల్ ఆటో డ్రైవర్లపైన ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. తక్షణమే ఆటో పర్మిట్లపై నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఆటోల కంటే డిజిల్‌తో నడిచే కార్లు, బస్సులు, లారీలు, భారీ వాహనాల వలన కాలుష్యం పదిరేట్లు ఎక్కువగా వస్తుందన్నారు. భారీ వాహనాలకు లేని నియంత్రణ ఆటోలకు ఎందుకని ప్రశ్నించారు. గ్యాస్ ఎల్పీజీ, సీఎన్ జీ ఆటోల వల్ల వచ్చే కాలుష్యం కన్నా పదిరేట్లు ఎక్కువ కాలుష్యం డిజిల్ వాహనాలకు వెదజల్లుతున్నాయన్నారు. పెట్రోల్, గ్యాస్, డిజిల్, నిత్యవసరాల వస్తువుల ధరలు పెరిగినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆటో మీటర్లు రేట్లు పెంచకపోవడం శోచనీయమన్నారు. కనీసం మీటర్ చార్జీలు రూ. 45 లుగా ప్రతి కిలోమీటర్ రూ.20 లుగా సవరించాలన్నారు. గత 10 సంవత్సరాలుగా ఆటో, ఇతర ప్రైవేటు రవాణ వాహనాల ఇన్సూరెన్స్ చార్జీలు పెరిగాయన్నారు. వాహనాలకు, డ్రైవర్లకు ఇన్సురెన్స్ కట్టుకోలేని పరిస్థితి ఉందని తెలిపారు.

ఐఆర్డీఏ తో చర్చించి ఇన్సురెన్స్ ఛార్జీలు తగ్గించాలని కోరారు. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటుకు తక్షణమే జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆటో ఫైనాన్షియర్ల దోపిడిని అరికట్టాలన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందిస్తు మార్గదర్శకాలని రూపొందించాలన్నారు. సీ.ఎన్.జీ, ఎల్‌పీజీ ఫిల్లింగ్ స్టేషన్లలో జరుగుతున్న అక్రమాలకు కళ్ళెం వేయాలన్నారు. ఇండ్లు లేని పేద ఆటో డ్రైవర్లకు డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించాలన్నారు. తగిన ఆటో స్టాండు ఏర్పాటు చేయాలని కోరారు.

Next Story

Most Viewed