- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బీజేపీ పాలనలో రాజ్యాంగం ప్రమాదంలో పడింది: ప్రముఖులు

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలో బీజేపీ పాలనలో రాజ్యాంగం ప్రమాదంలో పడిందని, బీజేపీ పాలనలో విద్య, ఉపాధి నిర్లక్ష్యం గురైతున్నదని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. నూతన విద్యా విధానం పేరుతో దేశంలో దేశ విద్యారంగాన్ని కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెట్టే విధానాలు బీజేపీ అవలంభిస్తూ విద్యారంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందని ఎస్ఎఫ్ఐ ఆలిండియా అధ్యక్ష్యా, కార్యదర్శులు వి.పి. సాను, మయూక్ బిశ్వాస్ అన్నారు. భారత విద్యార్ధి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ) 17వ అఖిల భారత మహాసభలు డిసెంబర్ 13 నుంచి 16 వరకు రాష్ట్రంలో హైదరాబాద్‌లో నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా మహాసభల జయప్రదానికై ఆహ్వాన సంఘాన్ని శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ. లింబాద్రి మాట్లాడుతూ.. విద్యారంగం కార్పొరేటీకరణ, వ్యాపారీకరణ జరుగుతున్న నేపథ్యంలో వాటిని అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దానిపై పోరాటం చేయాల్సిన బాధ్యత విద్యార్థి సంఘాల మీద ఉందన్నారు. ఎస్ఎఫ్ఐ జాతీయ మహాసభలు రాష్ట్రంలో జరపడం ద్వారా ఈ మహాసభల్లో అలాంటి పోరాటాలను ఉధృతం చేయడానికి ఒక వేదిక అవుతుందని భావించారు.
మాజీ టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ దేశంలోని విద్యారంగం కాషాయీకరణ గురి చేస్తున్నారని అన్నారు. అన్ని రంగాలు మతోన్మాద వ్యక్తులను జొప్పించి విద్యను నాశనం చేస్తున్నారని విమర్శించారు. వీటిపై పోరాడాల్సిన ఆవశ్యకత నేడు ఉందన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ.. ఎస్ఎఫ్ఐ జాతీయ మహాసభలు హైదరాబాద్‌లో జరపడం అంటే విద్యార్థులకు ఉపయోగం జరగాలని, విద్యార్థులందరికీ విద్యారంగ రక్షణకు విద్యార్దులందరూ పోరాటాలకు వచ్చేలా కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు. ఆహ్వాన సంఘ గౌరవ అధ్యక్షులుగా ప్రొఫెసర్ ఘంటా చక్రపాణిని, అధ్యక్షులుగా టీచర్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డిని, గౌరవ సలహాదారుగా ప్రొఫెసర్ నాగేశ్వర్, సహ అధ్యక్షుడిగా శ్రీనివాస్ రెడ్డి, జనరల్ సెక్రటరీ టి. నాగరాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్. ఎల్. మూర్తి, రవి కోశాధికారిగా ఎండీ. జావేద్‌లను ఎన్నుకున్నారు.