మల్లారెడ్డిని మంత్రి పదవి నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలి: రెడ్డి జాగృతి సంఘం

by Dishanational1 |
మల్లారెడ్డిని మంత్రి పదవి నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలి: రెడ్డి జాగృతి సంఘం
X

దిశ, ఖైరతాబాద్: రెడ్డి మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన మల్లారెడ్డిని మంత్రి వర్గం నుండి తక్షణమే బర్తరఫ్ చేయాలని రెడ్డి జాగృతి సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యవస్థాపక అధ్యక్షుడు పిట్ట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... మంత్రి మల్లారెడ్డి బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన వస్తుందని హెచ్చరించారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామన్నారు. కేసీఆర్ ప్రభుత్వం మంత్రి మల్లారెడ్డిని తొలగించకపోతే రెడ్డి కులస్తులు తమ ఓటుతో జవాబు చెప్తామన్నారు.



Next Story

Most Viewed