- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
'హైదరాబాద్ చరిత్రలో సెప్టెంబర్ 22 ఒక బ్లాక్ డేగా నిలుస్తుంది'

దిశ, డైనమిక్ బ్యూరో : జింఖానా గ్రౌండ్స్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ 22 హైదరాబాద్ చరిత్రలో బ్లాక్ డేగా నిలిచిపోతుందన్నారు. హైదరాబాద్‌లో ఎన్నో రోజుల నుంచి ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు, ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్నాయని, కానీ ఎప్పుడు మ్యాచ్ టికెట్ల కోసం ఇంత దారుణం జరగలేదన్నారు. టికెట్ల కోసం క్యూ లైన్‌లో నిల్చున్న వారిపై లాఠీ చార్జీ జరగడం దురదృష్టకరమైన సంఘటన అన్నారు. మ్యాచ్ కోసం కనీసం 35 వేల టికెట్లు అందుబాటులో ఉండాలని.. అయితే, 35 వేల టికెట్లలో ఐదారువేల టికెట్లు మాత్రమే జనరల్ పబ్లిక్ కోసం పెట్టారని, మిగతా టికెట్లన్నీ ముందే అయిపోయినట్లుగా చెప్పారని మండిపడ్డారు.
టికెట్లు ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో ఎన్ని అమ్మారనేది ప్రతీది లెక్క ఉంటుందని, ప్రెస్‌మీట్‌లో అడిగిన ప్రశ్నకు కూడా అజారుద్దీన్ సమాధానం చెప్పలేకపోయారని అన్నారు. మ్యాచ్ జరిపేది ఎవరి కోసం.. పబ్లిక్ కోసమే కదా, సగటు ప్రేక్షకుడి వల్లే క్రికెట్‌లో ఇన్ని వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తోందని అన్నారు. మరీ ఆ ప్రేక్షకుడిని పక్కన పెట్టేసి మీరు మీ మెప్పు కోసం రాజకీయ నాయకులకు, ప్రభుత్వ అధికారులకు, పోలీసులకు, టికెట్లు ఇవ్వడం ఏంటీ ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు స్టేడియంలో రూఫ్ ఎగిరిపోయింది, కూర్చీలు సరిగా లేవు, గ్రౌండ్ కూడా ప్రాపర్ కండిషన్‌లో లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంత దిగజారి వ్యవహారించడం దారుణమన్నారు. మ్యాన్ పవర్ లేకపోతే.. ఈవెంట్ మేనేజర్లకు అప్పజెప్పాలని, హెచ్‌సీఏ ఆ మాత్రం చేయలేరా? అని ప్రశ్నించారు.