సీనియారిటీ జాబితాలు సమగ్రంగా రూపొందించాలి : ఎమ్మెల్సీ నర్సిరెడ్డి

by Disha Web Desk 15 |
సీనియారిటీ జాబితాలు సమగ్రంగా రూపొందించాలి : ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
X

దిశ, ముషీరాబాద్ : సీనియారిటీ జాబితాలు సమగ్రంగా రూపొందించాలని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అన్నారు. పదోన్నతులకు అర్హతగలిగిన ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలు సబార్డినేట్ సర్వీస్ నిబంధనలకు అనుగుణంగా అన్ని జిల్లాల్లో ఒకే రకంగా సమగ్రంగా రూపొందించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వర్గం (ఆఫీసు బేరర్స్) సమావేశం డిమాండ్ చేసింది. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) రాష్ట్ర ఆఫీసు బేరర్స్ సమావేశం ఆదివారం టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో కె.జంగయ్య అధ్యక్షతన జరిగింది. ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పూర్తి అయిన వెంటనే అన్ని ఖాళీలకు నోటిఫికేషన్ ఇవ్వాలని, తద్వారా వచ్చే విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలని కోరారు.

జిఓ 317 ద్వారా పొరుగు జిల్లాలకు కేటాయించబడిన ఉపాధ్యాయులను పదోన్నతుల అనంతరం ఏర్పడిన ఖాళీల్లో సొంత జిల్లాలకు తీసుకురావాలని, మిగిలి పోయిన 13 జిల్లాల దంపతుల బదిలీలు పూర్తి చేయాలని సూచించారు. ప్రధాన కార్యదర్శి చావ రవి మాట్లాడుతూ పదోన్నతి అర్హతగలిగిన ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలను సబార్డినేట్ సర్వీస్ నిబంధనలకు అనుగుణంగా అన్ని జిల్లాల్లో ఒకే విధంగా తయారు చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల జరిగిన 615 స్పౌజ్ బదిలీలు, పదోన్నతులకు నిర్దేశించిన పోస్టులలోనే చేసినందున తద్వారా ఆయా జిల్లాల్లో ఏర్పడిన ఖాళీలను పదోన్నతుల కోటాలోనే చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిహెచ్.రాములు, కోశాధికారి టి.లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి మాణిక్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు కె.సోమశేఖర్, ఎం.రాజశేఖర్ రెడ్డి, జి.నాగమణి, ఇ.గాలయ్య, బి.రాజు, ఎస్.రవిప్రసాద్, కె.రవికుమార్, జి.శ్రీధర్, ఎ.సింహాచలం, వై.జ్ఞానమంజరి, ఎస్ కె మహబూబ్ అలీ పాల్గొన్నారు.


Next Story

Most Viewed