నిషేధిత ఫారెన్ సిగరెట్ల విక్రేత అరెస్ట్.. రూ. 3 లక్షల విలువైన ఫారిన్ సిగరెట్లు స్వాధీనం

by Disha Web Desk 11 |
నిషేధిత ఫారెన్ సిగరెట్ల విక్రేత అరెస్ట్.. రూ. 3 లక్షల విలువైన ఫారిన్ సిగరెట్లు స్వాధీనం
X

దిశ, బహదూర్ పురా: నిషేధించబడిన ఫారెన్ సిగరెట్లను విక్రయిస్తున్న వ్యక్తిని సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ బృందం మొగల్ పుర పోలీసులతో కలిసి అరెస్టు చేయడం జరిగింది. సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ డీసీపీ చక్రవర్తి గుమ్మి, ఇన్ స్పెక్టర్ రాఘవేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. మొగల్ పురాకు చెందిన తలాల్ ఇమామ్ (45), పాతబస్తీలో హోల్ సేల్ బట్టల వ్యాపారాన్ని నిర్వహించేవాడు. లాక్ డౌన్ కారణంగా వ్యాపారంలో నష్టాలను చవిచూశాడు. ఆర్థిక సమస్యల కారణంగా సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో విదేశీ సిగరెట్ల అమ్మకానికి పథకం వేశాడు. ఫారెన్ సిగరెట్లకు ఉన్న డిమాండ్ ను ఆసరా చేసుకుని బేగంబజార్ లో ఉండే సునీల్ తో పరిచయం పెంచుకున్నాడు.

గుట్టు చప్పుడు కాకుండా మధ్యవర్తుల ద్వారా విదేశీ సిగరెట్లను కొని హోల్ సేల్ కు రిటైల్ గా సరఫరా చేయడం ప్రారంభించాడు. శుక్రవారం మొగల్ పురా పోలీస్ స్టేషన్ పరిధిలో సిగరెట్లు విక్రయిస్తున్నాడని పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ బృందం మొగల్ పురా పోలీసులతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. రెండవ నిందితుడు సునీల్ పరారీలో ఉన్నాడు. నిందితుడి వద్ద నుంచి రూ. 3 లక్షల విలువైన 18 కార్టూన్ల ఫారెన్ సిగరెట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.



Next Story