Liquor Seized: ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారుల తనిఖీలు.. రూ.12 లక్షలు విలువ చేసే మద్యం సీజ్

by Shiva |
Liquor Seized: ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారుల తనిఖీలు.. రూ.12 లక్షలు విలువ చేసే మద్యం సీజ్
X

దిశ, వెబ్‌డెస్క్: నాన్ డ్యూటీ మద్యాన్ని అక్రమంగా తీసుకొస్తున్న ముఠాపై కస్టమ్స్ అధికారులు కేసులు నమోదు చేసిన ఘటన శంషాబాద్ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవలే గోవాకు వెళ్లిన 12 మంది తిరుగు ప్రయాణంలో హైదరాబాద్‌కు పెద్ద ఎత్తున నాన్ డ్యూటీ మద్యాన్ని అక్రమంగా తీసుకొచ్చారు. దీంతో అనుమానవం వచ్చిన పోలీసులు వారి లగేజీని చెక్ చేయగా సుమారు మొత్తం 415 మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. వాటి విలువ బహిరంగ మర్కెట్‌లో రూ.12 లక్షలకు పైగానే ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. ఈ మేరకు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని వారందరిపై అధికారులు కేసులు నమోద చేశారు.

Advertisement

Next Story

Most Viewed