- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
హవాలా మార్గంలో తరలిస్తున్న రూ 1.24 కోట్ల నగదు పట్టివేత

దిశ ప్రతినిధి , హైదరాబాద్: హవాలా మార్గంలో పెద్ద మొత్తంలో నగదు తరలిస్తున్న ఓ వ్యక్తిని సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని అతని నుండి రూ 1.24 కోట్ల ఆధారాలు లేని నగదును స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధా కిషన్ రావు కథనం ప్రకారం.. యూపీ మీరట్‌కు చెందిన షోయబ్ మాలిక్ ఈ యేడాది ఫిబ్రవరి నెలలో హైదరాబాద్ వచ్చి కాటేదాన్ జల్ పల్లిలో బిస్మిల్లా ట్రేడర్స్ పేరుతో స్క్రాప్ దుకాణం నిర్వహిస్తున్నాడు. కాగా యూపీకి చెందిన అతనికి మామ వరస అయ్యే కమిల్ మాలిక్ గుజరాతీగల్లికి చెందిన భరత్ నుండి రూ 1.24 కోట్ల నగదును తీసుకుని సంభవ్, ఆదిల్, మినాజ్ సద్దాం, షఫి అనే వారికి అప్పగించాలని కోరాడు.
దీంతో షోయబ్ మాలిక్ తన వద్ద పని చేసే అక్లాక్‌ను పంపి భరత్ నుండి నగదు తీసుకున్నాడు. కాగా విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్ స్పెక్టర్ ఆర్ రఘునాథ్ ఎస్ఐ సాయికిరణ్‌లు సిబ్బందితో అక్లాక్‌ను అదుపులోకి తీసుకుని అతని నుండి నగదును స్వాధీనం చేసుకున్నారు. డబ్బులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో స్వాధీనం చేసుకున్న మొత్తాన్ని ఆదాయ పన్ను శాఖ అధికారులకు, కేసు తదుపరి విచారణను హుమాయున్ నగర్ పోలీసులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది.