- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
హవాలా మార్గంలో తరలిస్తున్న భారీ నగదును స్వాధీనం..

దిశ ప్రతినిధి, హైదరాబాద్ : హవాలా మార్గంలో నగదును తరలిస్తున్న ఐదుగురి నుండి సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రూ 63.50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ డీసీపీ పీ రాధాకిషన్ రావు కథనం ప్రకారం.. ట్రూప్ బజార్ లోని రనూజ మార్కెట్ నుండి పెద్ద మొత్తంలో హవాలా డబ్బులు చేతులు మారుతున్నాయని విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం ఉదయం దాడి చేశారు. ఈ సందర్భంగా గోడౌన్ యజమాని కాంతి లాల్ (39), ఆప్టికల్ వ్యాపారి కిషోర్ సింగ్, గౌలి గూడ ఆర్ జే స్టీల్ షాప్‌లో పని చేసే పెప్ సింగ్ (47), చాంద్రాయణ్ గుట్ట కేశవగిరికి చెందిన మహ్మద్ అబ్దుల్ ఫరీద్ (38), రాజేంద్ర నగర్ మారుతీనగర్‌కు చెందిన ప్లాస్టిక్ రీ సైక్లింగ్ వ్యాపారి సందీప్ సింగ్‌లు హవాలా మార్గంలో డబ్బులు తరలించేందుకు గాను రెండు బ్యాగ్ లలో ప్యాక్ చేసి ఉంచారు.
విశ్వసనీయంగా సమాచారం అందడంతో సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్ రఘునాథ్, ఎస్ఐ షానవాజ్ షఫి సిబ్బందితో కలిసి దాడులు చేపట్టారు . హవాలా వ్యాపారానికి ప్రధాన ఆపరేటర్ అయిన జోగ్ సింగ్ సూచనల మేరకు అతను ఫరీద్, సందీప్ సింగ్‌లకు రూ 42 లక్షలను అందజేయగా కిషోర్ సింగ్ నుండి రూ.21.5 లక్షలు అందుకున్నాడు. పోలీసుల దాడుల సందర్భంగా ఈ మొత్తానికి ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో మొత్తం కలిపి రూ 63.50 లక్షల నగదు, సెల్ ఫోన్, నగదు లెక్కింపు యంత్రం, ఓ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు . విచారణలో గోడౌన్ యజమాని కాంతి లాల్ జోగ్ సింగ్‌తో కలిసి హవాలా వ్యాపారంలో సబ్-ఆపరేటర్‌గా వ్యవహరిస్తున్నట్లు వెల్లడించాడు. స్వాధీనం చేసుకున్న నగదుతో పాటు నిందితులను తదుపరి విచారణ నిమిత్తం అఫ్జల్ గంజ్ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .