ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించాలి

by Disha Web |
ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించాలి
X

దిశ, సికింద్రాబాద్ : ఈ పార్లమెంట్ సమావేశాలల్లోనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ చేస్తున్న మాదిగల సంగ్రామ పాదయాత్ర ఆదివారం బౌద్ధనగర్ కు చేరుకుంది. కోఆర్డినేటర్ డప్పు మల్లికార్జున్ మాదిగ ఆధ్వర్యంలో కొనసాగిన ఈ పాదయాత్రలో ఎంఎస్ఎఫ్ నాయకులు సోమశేఖర్ హాజరై మాట్లాడారు. వచ్చే నెల మూడవ తేదీన బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద వేలాది మందితో జరగబోయే మహాధర్నాకు మాదిగ సోదరులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని అయన పిలుపునిచ్చారు. ఈ మేరకు హైదరాబాద్​లో ఉన్న ప్రతి మాదిగ బస్తీలో పాదయాత్రలో భాగంగా తిరుతున్నట్లు తెలిపారు.

కరపత్రాల ద్వారా వర్గీకరణ విషయంలో బీజేపీ చేసిన మోసాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నట్ట తెలిపారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే వర్గీకరణ చేస్తామన్న బీజేపీ తొమ్మిది సంవత్సరాలు గడిచినా వర్గీకరణ చేయకుండా అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. వర్గీకరణ చేయకుండా నాయకులు తమ వాడల్లో అడుగు పెడితే తగిన బుద్ది చెప్తామని హెచ్చరించారు. యాత్రలో హోలీయ దాసరి రావుల యాదగిరి, శ్రీనివాస్, కొలిపాక ఈశ్వర్ రావు మాదిగ, మనంపల్లి మురళీధర్ మాదిగ, దినేష్ రావు మాదిగ, ఎంఎస్పీ జాతీయ నాయకులు ఎడవెల్లి యాదయ్య మాదిగ, ముషీరాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ గజ్జల రాజశేఖర్ మాదిగ, అంబర్పేట్ నియోజకవర్గ ఇన్చార్జ్ బడుగుల బాలకృష్ణ మాదిగ, బేకి సత్యనారాయణ మాదిగ పాల్గొన్నారు.Next Story