- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రెడ్ హిల్స్‌లో ఎగుమతి ఉత్సవ్.. పాల్గొన్న ఎస్‌బీఐ సీజీఎం

దిశ ప్రతినిధి, హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫిక్కి, ఎఫ్‌టీ సీసీఐల సంయుక్త ఆధ్వర్యంలో రెడ్ హిల్స్‌లో బుధవారం ఎగుమతి ఉత్సవ్‌ను నిర్వహించారు. ''ఎమర్జింగ్ బిజినెస్ అండ్ ఫైనాన్సియల్ అపర్చునిటీస్ ఫర్ ఎక్స్ పర్ట్స్'' పేరిట నిర్వహించిన ఈ సదస్సులో సుమారు 150 మందికి పైగా ఎగుమతిదారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్‌బీఐ హైదరాబాద్ సర్కిల్ సీజీఎం అమిత్ జింగ్రాన్ మాట్లాడుతూ.. ఎగుమతులకు సంబంధించిన మొత్తం రంగాలు అంటే ప్రక్రియ, ప్రమేయం ఉన్న పత్రాలు, మార్కెట్‌లో సంభావ్యత మొదలైనవాటి గురించి వివరించారు. ఎగుమతిదారులకు అందుబాటులో ఉన్న వివిధ సౌకర్యాల గురించి కార్యక్రమంలో పాల్గొన్న పలువురు వివరించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ జీఎం మంజు శర్మ, ఎఫ్‌టీ సీసీఐ అధ్యక్షుడు అనిల్ అగర్వాల్, ఫిక్కి బ్యాంకింగ్ ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్ కమిటీ చైర్మన్ ప్రేమ్‌చంద్ కంకారియా, జనరల్ మేనేజర్ నవీన్ కుమార్ ఝా, అంతర్జాతీయ ఎగుమతి శిక్షకులు పరేష్ సోలంకి, సంకిత్ సోనీ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.