- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
'పురుషుల హక్కుల కోసం ప్రత్యేక చట్టాలు తేవాలి'

దిశ, ఖైరతాబాద్: పురుషుల హక్కుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తీసుకు రావాలని సేవ్ ఇండియన్ ఫ్యామిలీ (హైదరాబాద్) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆదివారం సోమజిగూడా ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంస్థ ప్రతినిధులు హర్విథ్ సింగ్, కృష్ణా రావు, విశ్వనాథ్ లు మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం లోయర్ ట్యాంక్ బండ్‌లోని ఇందిరా పార్క్‌లో బాధిత పురుషులకు ఉచిత కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహిస్యున్నట్లు తెలిపారు. బాధితులు ఎవరైనా వారి కష్ట సుఖాలు చెప్పుకుని న్యాయ సలహాలు పొందవచ్చునన్నారు.
ప్రస్తుత సమాజంలో మహిళలు అనగానే గుడ్డిగా సపోర్ట్ చేస్తున్నారని.. దీంతో న్యాయం జరగలేదని పురుషులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మహిళలకు చట్టాలు చేసినట్టే పురుషులకు కూడా తేవాలని డిమాండ్ చేశారు. పురుషుల పై తప్పుడు కేసులు పెట్టె మహిళలను శిక్షించే విధంగా చట్టాలు ఉండాలి. పురుషులకు అనుగుణంగా ప్రత్యేక చట్టం తేవాలి. అలాగే పోలీసులు 498 కేసుల పై సమగ్ర విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాలని అన్నారు.