- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
బీఆర్ఎస్ పార్టీలోకి కోనేరు సత్యనారాయణ

దిశ ప్రతినిధి,కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ మంగళవారం ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కొత్తగూడెం నియోజకవర్గం నుండి 100 కార్లలో ర్యాలీగా బయలుదేరి హైదరాబాద్ చేరుకున్నారు. కోనేరు సత్యనారాయణ తో పాటు అభిమానులు తన కార్యకర్తలతో పాటు బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఎవరూ లేకపోవడంతో కోనేరు సత్యనారాయణ చేరిక బీఆర్ఎస్ పార్టీకి బలం చేకూర్చిందని చెప్పవచ్చు.
ఈ సందర్భంగా కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ బీఆర్ఎస్ లో పార్టీలో చేరటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ముఖ్యంగా జిల్లా అభివృద్ధికి అదే విధంగా కొత్తగూడెం అభివృద్ధి కోసం తాను పార్టీలో చేరుతున్నట్టు వెల్లడించారు. అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న బైపాస్ రోడ్డు నిర్మాణానికి 80 కోట్ల కేటాయించాలని, పాల్వంచ పట్టణంలో 444, 817,999 సర్వే నెంబర్లు గల భూమికి రిజిస్ట్రేషన్లు కాకపోవటం వల్ల సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
► Read More 2023 Telangana Legislative Assembly election News
► For Latest Government Job Notifications
► Follow us on Google News