- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తెలంగాణలో కొనసాగుతున్న అభివృద్ధి పథకాలు ఇతర రాష్ట్రాలలో లేవు: ఆర్వీ మహేందర్ కుమార్

దిశ ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇతర ఏ రాష్ట్రాలలో లేవని టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ఉద్యమ నేత ఆర్వీ మహేందర్ కుమార్ అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన గోషామహల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్వీ మహేందర్ కుమార్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితల కారణంగా బతుకమ్మ పండుగకు దేశ వ్యాప్త గుర్తింపు దక్కిందన్నారు.
దేశ రాజధానిలో బతుకమ్మ వేడుకలు నిర్వహించక తప్పని పరిస్థితి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి టీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించిందన్నారు. ప్రజలు అన్ని పార్టీలను గమనిస్తున్నారని, అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన టీఆర్ఎస్‌ను మునుగోడు ఉప ఎన్నికలలో గెలిపిస్తారని జోస్యం చెప్పారు. నోటిఫికేషన్ అనంతరం తాను కూడా మునుగోడు ప్రచారంలో పాల్గొని పార్టీ అభ్యర్థి గెలుపుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు .