ఆర్టీసీ కార్మికులపై వేధింపులు ఆపాలి: రాజిరెడ్డి

by S Gopi |   ( Updated:2022-10-15 15:28:03.0  )
ఆర్టీసీ కార్మికులపై వేధింపులు ఆపాలి: రాజిరెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్టీసీ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని, కేఏంపీఎల్, ఈపీకే పేరున కార్మికులపై వేధింపులు ఆపాలని టీఎస్ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ రాజిరెడ్డి ధ్వజమెత్తారు. శనివారం ముషీరాబాద్ డిపో జేఏసీ ఆధ్వర్యంలో డిమాండ్స్ బ్యాడ్జీలు ధరించి నిధులు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజిరెడ్డి మాట్లాడుతూ.. కార్మికులపై పని భారాలు పెంచరాదని, స్పెషల్ ఆఫ్ డ్యూటీలను సింగిల్ క్రూ డ్యూటీలుగా మార్చరాదని, అన్ని కేటగిరీలలో అర్హత కలిగిన వారికి ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. టిమ్‌డ్యూటీలు చేయాలని డ్రైవర్లపై వేధింపులు, కార్మికులు ఆత్మహత్యలు చేసుకునేలా ప్రవర్తిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యూనియన్ కార్యకలాపాలను అనుమతించాలని రెండు పే స్కేల్స్, ఐదు డీఏలు, 2013 వేతన సవరణ బాండు డబ్బులు చెల్లించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు కిషన్ గౌడ్, వెంకటేష్, బాకర్ ఆలీ, కృష్ణ, వెంకన్న, నర్సింహ, విఎన్ రావు, శ్రీరాములు, డీఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్

Next Story

Most Viewed