డ్రింకింగ్ వాటర్ తో కారు క్లీనింగ్.. రూ. 10 వేల ఫైన్

by Muthe.Rajitha |

తాగే నీళ్లతో కారు కడగడంతో జలమండలి భారీగా జరిమానా విధించింది.

డ్రింకింగ్ వాటర్ తో కారు క్లీనింగ్.. రూ. 10 వేల ఫైన్
X

దిశ, వెబ్ డెస్క్ : తాగే నీళ్లతో కారు కడగడంతో జలమండలి భారీగా జరిమానా విధించింది. హైదరాబాద్ బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్ 12లో ప్రభుత్వం సరఫరా చేసే డ్రింకింగ్ వాటర్ తో ఓ వ్యక్తి కారు కడగడాన్ని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి స్వయంగా గమనించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎండీ, తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించొద్దని హెచ్చరించి.. ఆ వ్యక్తిపై రూ.10,000 జరిమానా విధించారు. మరోసారి ఈ విధంగా చేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు నగర పౌరులను హెచ్చరించారు.

Next Story