హైటెక్ సిటీలో చెరువులు తలపించిన రోడ్లు

by Taduka Kalyani |   (  Updated:2026-06-09 15:34:40  IST  )

మాదాపూర్, కొత్తగూడ ప్రాంతంలో సాయంత్రం కురిసిన భారీ వర్షానికి రోడ్డు జలమయమయ్యాయి.

హైటెక్ సిటీలో చెరువులు తలపించిన రోడ్లు
X

దిశ, శేరిలింగంపల్లి : మాదాపూర్, కొత్తగూడ ప్రాంతంలో సాయంత్రం కురిసిన భారీ వర్షానికి రోడ్డు జలమయమయ్యాయి. కొత్తగూడ ఫ్లైఓవర్ దగ్గర రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీగా వర్షం నీరు చేరడంతో కార్లలోకి నీరు చేరి నడిరోడ్డు పైన నిలిచిపోయాయి. రోడ్లపై వర్షం నీరు చెరువును తలపించింది. గత ఏడాది ఫ్లై ఓవర్ పై వర్షం నీరు ప్రవహించి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు గురయ్యారు. ఈ ఏడాది వర్షాకాలంలో సమస్యను అధిగమించేందుకు ముందస్తుగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని చెప్పిన సీఎం సి అధికారులు మాటలు నీటి మీద రాతలుగానే మిగిలిపోయాయి. ముందస్తు పేరుతో రూపొందించిన ప్రణాళికలు కాగితాలకే పరిమితమయ్యాయి. తాజాగా కురిసిన 5.6 ఎంఎం వర్షపాతానికే రోడ్లు జలమయమై రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మాదాపూర్ సున్నం చెరువు సమీపంలో ఇళ్లల్లోకి నీరు చేరి తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చందానగర్ దీప్తి శ్రీనగర్ రోడ్డుపై భారీగా వర్షం నీరు చేరింది. ప్రతి ఏట అయ్యా ప్రాంతంలో ఇబ్బందులు ఎదురవుతున్న ముందస్తు చర్యలు తీసుకుకపోవడంతో అధికారులు విఫలమయ్యారని భవిష్యత్తులో పెద్ద ఎత్తున వర్షాలు కురిస్తే ఎలా ఉంటుందోనని హైటెక్ సిటీ వాసులు ఆందోళన చెందుతున్నారు.

స్టీల్ బ్రిడ్జిపై చెరువును తలపించిన వరద.. 3 గంటల పాటు ట్రాఫిక్ జామ్

Next Story