- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Revanth Reddy: మా పార్టీ తెలంగాణ ఇవ్వకపోతే సీఎం కుటుంబం ఎక్కడ ఉండేది: రేవంత్ రెడ్డి

Revanth Reddy
దిశ ప్రతినిధి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకుంటే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్(KTR), ఎమ్మెల్సీ కవిత(Kavitha)లు ఎక్కడ ఉండేవారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రశ్నించారు. ఈ నెల 7వ తేదీన తెలంగాణలో పర్యటించనున్న కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ.. చంచల్ గూడ జైలులో ఉన్న ఎన్ఎస్ యూఐ అధ్యక్షుడు వెంకట్‌తో పాటు మరో 17 మంది విద్యార్థి సంఘ నాయకులను కలుస్తారని, ఆ రోజున ములాఖత్‌కు అనుమతించాలని జైలు సూపరింటెండెంట్ శివకుమార్ గౌడ్‌కు రేవంత్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. జైలు అధికారులు స్వతంత్రంగా వ్యవహరించాలని సూచించారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi) వారిని కలిసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని జైలు అధికారులను కోరడం జరిగిందన్నారు.
అంతేకాకుండా రాహుల్ గాంధీ ఓయూ పర్యటన పై కాంగ్రెస్ నేతలు వీసీని కలిసి అనుమతి కోరినట్లు చెప్పారు. విద్యార్థి సంఘాలు, ఉద్యమకారులు రాహుల్ గాంధీ రావాలని కోరుతున్నప్పటికీ సీఎం కేసీఆర్ ఒత్తిడి వల్ల ఆయన ఓయూ పర్యటనను తిరస్కరించారని ఆరోపించారు. ఎన్ఎస్ యూఐ విద్యార్థులు రాజకీయాలకు అతీతంగా ఈ పర్యటన ఉంటుందని వీసీని కోరినప్పటికీ.. వినిపించుకోకుండా అక్కడికి వెళ్లిన విద్యార్థి నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో బంధించారని మండిపడ్డారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుంటే సీఎం కేసీఆర్‌తో సహా ఆయన కుటుంబ సభ్యులు ఈరోజు ఎక్కడ ఉండేవారని ప్రశ్నించారు.
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి(Jaggareddy) మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో భాగంగా 6వ తేదీన వరంగల్‌లో జరిగే రైతు సభలో పాల్గొంటారని తెలిపారు. రాహుల్ గాంధీ ఓయూ విజిట్ కోసం అనుమతి కోరితే రిజెక్ట్ చేశారని, ఆదివారం రోజున పోలీసులు ఓవర్ యాక్షన్ చేసి స్టూడెంట్స్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంచల్ గూడ జైల్లో ఉన్న ఎన్ఎస్ యూఐ నేతలను పరామర్శించడానికి రాహుల్ వస్తారని, ఓయూ విజిట్‌కు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా రాహుల్‌ను ఓయూకి తీసుకెళతామని, లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తే దానికి సర్కారే బాధ్యత వహించాలని జగ్గారెడ్డి అన్నారు. ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, అనిల్ కుమార్ యాదవ్, ఫిరోజ్ ఖాన్, వినోద్ రెడ్డి తదితరులతో కలిసి జైలు సూపరింటెండెంట్‌కు రేవంత్ రెడ్డి వినతి పత్రం అందజేశారు.