- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
డిప్యూటీ మేయర్ ను కలిసిన మాణికేశ్వరీనగర్ బస్తీవాసులు
by srinivas |

X
దిశ, సికింద్రాబాద్ : తమ డివిజన్ లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలంటూ తార్నాక డివిజన్ మాణికేశ్వరీనగర్ లోని లాల్ బహదూర్ అసోసియేషన్ సభ్యులు శనివారం నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి ని కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు కాలనీలో ఉన్న చెట్లు పడిపోయే స్థితిలోకి వచ్చాయని, కొన్ని విద్యుత్ తీగలను తాకుతూ ప్రమాదకరంగా ఉన్నాయని తెలిపారు. వాటిని తొలగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు . దీనికి వెంటనే స్పందించిన డిప్యూటీ మేయర్ సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలను తీసుకోవాలని జీహెచ్ఎంసీ హార్టికల్చర్ విభాగం అధికారులకు సూచించారు.
Next Story