- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కేటీఆర్ మదమెక్కి ప్రవర్తిస్తున్నడు: రాజగోపాల్ రెడ్డి

X
దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక బీసీ బిడ్డ అయిన బండిసంజయ్ అన్న యాదాద్రి గుడిలో తడిబట్టలతో ప్రమాణం చేస్తే.. గుడిని సంప్రోక్షణ్ చేయాలని కేటీఆర్ కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతుండని మండిపడ్డారు. అక్రమ డబ్బు సంపాదించి కేటీఆర్ మదమెక్కి ప్రవర్తిస్తున్నాడని ఫైర్ అయ్యారు. త్వరలోనే అయ్యాకొడుకులు ఇద్దరికీ ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. కాగా, శనివారం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పుల్ని మోసిన చేతులు ఇప్పుడు యాదాద్రి ఆలయంలో దేవుడిని తాకాయని.. పవిత్రమైన దేవుడి సన్నిధిని సంప్రోక్షణ చేయాలని వేదపండితులకు, అధికారులకు మంత్రి కేటీఆర్ సూచించారు.
- Tags
- KTR
Next Story