చార్మినార్ వద్ద రాహుల్ గాంధీ సందడి.. ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు

by Satheesh |
చార్మినార్ వద్ద రాహుల్ గాంధీ సందడి.. ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు
X

దిశ, చార్మినార్: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఆరాంఘర్ మీదుగా మంగళవారం హైదరాబాద్ పాతబస్తీ బహదూర్ పురా లెగసీ ప్యాలెస్‌కు చేరుకుంది. రాహుల్​భారత్​జోడో యాత్రకు పాతబస్తీ కాంగ్రెస్​శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడ రాహుల్ గాంధీ విరామం తీసుకున్న తర్వాత తిరిగి సాయంత్రం 4గంటలకు బహదూర్ పుర నుంచి పురానాఫూల్, హుస్సేనిఆలం, లాడ్ బజార్ మీదుగా చార్మినార్‌కు చేరుకుంది. చారిత్రాత్మక చార్మినార్, లాడ్​బజార్​వద్ద అశ్వాలు.. ఒంటెలపై కాంగ్రెస్​ శ్రేణులు రాజీవ్​గాంధీ, డాక్టర్​బిఆర్​ అంబేద్కర్, హస్తం గుర్తు కటౌట్‌లతో రాహుల్​గాంధీకి ఘనంగా స్వాగతం పలికారు.

తెలంగాణ సంస్కృతిని ప్రతిబింభించేలా బోనాలు.. ఒగ్గు నృత్యాలు.. పలువురిని విశేషంగా ఆకట్టుకున్నాయి. మర్ఫా చప్పుళ్ళతో చార్మినార్​పరిసర ప్రాంతాలు మారుమ్రోగాయి. రాజీవ్ గాంధీ సద్భావనా యాత్రా స్మారక సమితి అధ్యక్షుడు జి. నిరంజన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేదికకు సాయంత్రం 4.41గంటలకు చేరుకున్నారు. అనంతరం మాజీ ప్రధాని రాజీవ్ చిత్రపటం వద్ద ఘనంగా నివాళులర్పించారు. రాజీవ్ గాంధీ సద్భావనా యాత్రా స్మారక స్తంభంపై రాహుల్ గాంధీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

అనంతరం ధ్వజ్​గీత్‌తో పాటు జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం జోడో జోడో.. భారత్​జోడో నఫరత్​చోటో భారత్​జోడో.. హిందూస్థాన్​జిందాబాద్.. అంటూ కాంగ్రెస్​శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తిరిగి చార్మినార్ నుంచి రాహుల్ గాంధీ జోడో యాత్ర మంగళవారం సాయంత్రం 4.45 గంటలకు బయలు దేరింది. చార్మినార్ నుంచి ప్రారంభమైన జోడో యాత్ర గుల్జార్ హౌజ్, మదీనా, నయాపూల్ మీదుగా గాంధీ భవన్ రూట్‌లో ముందుకు సాగింది. రాహుల్ గాంధీ రాకను పురస్కరించుకొని నగరా షహనాయి కార్యక్రమం ఏర్పాటు చేశారు.

చార్మినార్ వద్ద జోడో యాత్రలో రాహుల్ గాంధీ వెంట భారత్​ జోడో యాత్ర కమిటి చైర్మన్​దిగ్విజయ్​ సింగ్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్​, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, కార్యదర్శి నదీం జావిద్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి, వి.హనుమంత్​రావు, షబ్బీర్​ఆలీ, మాజీ ఎంపీ అంజన్​కుమార్​యాదవ్, మాజీ ఎమ్మెల్యే శశిధర్​రెడ్డితో పాటు బడంగ్​పేట్​మేయర్​చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, అనిల్​యాదవ్, పాతనగర కాంగ్రెస్​నాయకులు జి.ఆనంద్, జి.కన్నయ్యలాల్, జి. రాజరత్నం, బి.వెంకటేష్​ముదిరాజ్, అశోక్​రెడ్డి, కె.శ్యాంరావు ముదిరాజ్, డిఎల్​నర్సింగ్​రావు, శ్రీకాంత్​తదితరులు ఉన్నారు.

Next Story

Most Viewed