దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు

by Taduka Kalyani |

ఒక ఇంటి దొంగతనం కేసును ఛేదించి, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి దొంగిలించబడిన మొబైల్ ఫోన్లు, గ్యాస్ సిలిండర్, నగదును గోషామహల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు
X

దిశ, కార్వాన్ : ఒక ఇంటి దొంగతనం కేసును ఛేదించి, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి దొంగిలించబడిన మొబైల్ ఫోన్లు, గ్యాస్ సిలిండర్, నగదును గోషామహల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ శ్రావణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. జ్ఞాన్ బాగ్ కాలనీకి చెందిన పానీపూరి విక్రేత అరవింద్ ఇంట్లో గత నెల 28 రాత్రి దొంగతనం జరిగింది. రెండు మొబైల్ ఫోన్లు, రూ. 5,000 నగదు, ఎల్‌పిజి సిలిండర్ చోరీకి గురయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సిసిటివి ఫుటేజీ ఆధారంగా పక్కా సమాచారంతో పోలీసులు జూన్ 9 న ఎ. ప్రవీణ్ కుమార్ కె. సాయి శ్యామ్ సింగ్, డి. వినీత్ కుమార్ లను అరెస్ట్ చేశారు. అయితే ప్రవీణ్ కుమార్ దొంగతనానికి పాల్పడగా, ఆ సొత్తును దాచడానికి, విక్రయించడానికి సాయి శ్యామ్ సింగ్, వినీత్ కుమార్ లు సహకరించారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని రెండు మొబైల్ ఫోన్లు, ఒక ఖాళీ హెచ్‌పి సిలిండర్, రూ. 200 నగదు రికవరీ చేసి,నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.

Next Story