కల్తీ స్వీట్లు తయారు చేస్తున్న గోదాంపై పోలీసుల దాడులు

by Disha Web Desk 15 |
కల్తీ స్వీట్లు తయారు చేస్తున్న గోదాంపై పోలీసుల దాడులు
X

దిశ, చార్మినార్ : కల్తీ స్వీట్ లు తయారు చేస్తున్న గోదాంపై సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మొఘల్ పుర పోలీసులతో కలిసి దాడులు నిర్వహించారు. వివరాలలోకి వెళితే...ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన భోళా శంకర్ ఐదేళ్ల క్రితం లాల్ దర్వాజా ప్రాంతంలో ని ఓ సెల్యూలర్ ను అద్దెకు తీసుకున్నాడు. శంకర్ రాజస్థాన్ నుంచి స్కిమ్ మిల్క్ పౌడర్ ను అక్రమంగా

తీసుకు వచ్చి కలాకన్, అజ్మీర్ కలాకన్ తో పాటు కోవాను తయారు చేస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు సౌత్ జోన్ టాస్క్ఫోర్స్​ ఇన్ స్పెక్టర్ సంతోష్ బృందంతో పాటు మొఘల్ పుర ఇన్ స్పెక్టర్ శివకుమార్, జీహెచ్ ఎంసీఫుడ్ సేఫ్టీ అధికారులు మూర్తి రాజ్, ఫరీద్ ల తో కలిసి మంగళవారం స్వీట్లు తయారీ గోదాం పై దాడులు నిర్వహించారు. అందులో తయారు చేస్తున్న కలాకన్, అజ్మీర్ కలాకన్ తో పాటు కోవాను టెస్టింగ్ కు పంపారు.


Next Story

Most Viewed