పోలీస్ స్టేషన్లో పోలీసులు, నిందితులు జల్సా.. అది తాగుతూ..

by samatah |
పోలీస్ స్టేషన్లో పోలీసులు, నిందితులు జల్సా.. అది తాగుతూ..
X

దిశ, బహదూర్ పుర : సట్టా నిర్వహిస్తున్న నిందితులను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసిన సంఘటన బహదూర్ పుర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆకస్మిక దాడుల్లో భాగంగా బహదూర్ పుర పోలీస్ స్టేషన్ పరిధిలో సట్టా నిర్వహిస్తున్న ఇంటిపై దాడి చేసి ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుండి 28 వేల రూపాయల నగదు, ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కొరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితులను, నగదును బహదూర్ పుర పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ప్రజలతోనే కాదు నిందితులతో కూడా ఫ్రెండ్లీగా ఉంటామని పోలీసులు నిరూపించారు. పట్టుబడ్డ నిందితులు కూల్ డ్రింక్స్ తాగిపిస్తూ పోలీసులతో మమేకమైన దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. తప్పు చేసిన నిందితులను శిక్షించాల్సిన పోలీసులే ఇలా వ్యవహరిస్తే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిందితులకు సకల సౌకర్యాలు కల్పిస్తూ వారితో ఫ్రెండ్లీ గా ఉండడంతో పోలీసు వ్యవస్థపై ఉన్న నమ్మకం ప్రజలలో ఇంకా దిగజారిపోతుందని పలువురు విమర్శిస్తున్నారు.

Next Story

Most Viewed