- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
విచారణ పేరుతో పోలీసులు మానసికంగా వేధిస్తున్నారు : క్రిశాంక్

దిశ, శేరిలింగంపల్లి : బీఆర్ ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ డాక్టర్ మన్నె క్రిశాంక్ పై గచ్చిబౌలి పోలీసులు నమోదు చేసిన కేసులో మంగళవారం మరోసారి గచ్చిబౌలి పోలీసుల ఎదుట హాజరయ్యారు మన్నె క్రిశాంక్. ఉదయం నుంచి రాత్రి వరకు సుమారు 8 గంటల పాటు స్టేషన్ లో కూర్చోబెట్టిన పోలీసులు ఆయనను ఎలాంటి ప్రశ్నలు అడగలేదని సమాచారం. అయితే ఈనెల 18న మరోసారి విచారణకు రావాలంటూ పోలీసులు క్రిశాంక్ కు నోటీసులు ఇచ్చారు. స్టేషన్ నుండి ఇంటికి వెళ్తున్న క్రమంలో మీడియాతో మాట్లాడిన క్రిశాంక్.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై, మాట్లాడిన వారిపై కేసులు పెడుతున్నారని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెచ్ సీయూ భూముల విషయంలో మాట్లాడారు..
ప్రధానపై కూడా కేసులు పెట్టి విచారిస్తారా అని అన్నారు. ఎన్ని కేసులు పెట్టిన ప్రజల సమస్యలపై పోరాడుతామని తెలిపారు. రేవంత్ రెడ్డి సర్కార్ టైం పాస్ చేసి సమయం వృధా చేస్తుందని, ఈ కేసులో ఎన్ని సార్లు పిలిచినా పోలీసులకు సహకరిస్తామని అన్నారు క్రిశాంక్. అయితే విచారణ పేరుతో మానసికంగా వేధించడం సరికాదన్న ఆయన రేవంత్ రెడ్డి సర్కార్ రేపు సుప్రీంకోర్టులో జరిగే తీర్పును ఎదుర్కోవాల్సి ఉంటుందని, అందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. గ్రూప్ వన్ పరీక్షల్లో 702 మంది అభ్యర్థులకు సేమ్ మార్కులు వచ్చిన సంఘటనపై విచారణ జరపాలని, గ్రూప్ వన్ అవకతవకలు ఎక్కడ బయటకు వస్తాయనో విచారణ పేరుతో మమ్మల్ని స్టేషన్ కు పిలిచి కూర్చోబెడుతున్నారని, అయినా గ్రూప్ వన్ అభ్యర్థుల తరపున ఖచ్చితంగా సోషల్ మీడియాలో ప్రశ్నిస్తామని క్రిశాంక్ అన్నారు.