- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆకాశాన్నంటిన టమాటా ధర..

దిశ ప్రతినిధి, హైదరాబాద్: సంపన్నులు, పేద, మధ్యతరగతి ప్రజలు ఇలా ప్రతి ఒక్కరు ఇష్టపడే టమాటా ధరలు ఆకాశాన్నంటాయి. కేవలం పది రోజుల వ్యవధిలో వీటి ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరాయి. రైతుబజార్‌లలో వీటిని రూ70 కి కిలో చొప్పున విక్రయిస్తుండగా రిటైల్ మార్కెట్‌లో రూ 90 నుండి రూ 100 వరకు ఉన్నాయి. దీంతో టమాట ధరలు చెబితేనే పేద ప్రజలు భయపడే విధంగా పరిస్థితులు మారాయి. రాష్ట్రంలో టమాట దిగుబడి అవసరాల మేరకు లేకపోవడం, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు తగ్గడం, భారీ వర్షాలకు పంటలు దెబ్బ తినడం కారణంగా టమాటా ధరలు పెరిగాయి. ఓ వైపు ఇతర కూరగాయల ధరలు, నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోగా మరోవైపు వంట నూనెల ధరలు కాగుతున్నాయి. ఇప్పుడు టమాట కూడా వాటి సరసన చేరడంతో ప్రజలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. మే రెండవ వారం వరకు కిలో టమాట రూ 20 లోపే ఉండగా.. తాజాగా సెంచరీకి చేరింది. ప్రభుత్వం పెరిగిన కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.