- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నత్తనడకన బాక్స్ డ్రైనేజీ పనులు.. అవస్థలు పడుతున్న ప్రజలు

దిశ చైతన్య పురి: నత్తకే నడక నేర్పినట్లుగా ఉంది ప్రభుత్వ అధికారుల తీరు. బాక్స్ డ్రైనేజీ పనుల కోసం కాంట్రాక్టర్లు గుంతలు తీసి పనులు ప్రారంభించారు. నెలలు కావస్తున్న పనులు పూర్తి చేయడంలో అలసత్వం ప్రదర్శించడం వలన మధ్యలోనే నిలిచిపోయాయి. పర్యవేక్షించాల్సిన అధికారులు మిన్నకుండిపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.
సమస్య ఏమిటి..
కొత్తపేట డివిజన్‌లోని ఎస్ఆర్ఎల్ కాలనీలో బాక్స్ డ్రైనేజీ పనులు గత నెల క్రితం ప్రారంభమయ్యాయి. రోడ్డు మధ్యలో పెద్ద గుంతలు తీయడం మూలంగా కాలనీ ప్రజలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. త్వరితగతిన పనులు పూర్తి చేయకపోవడం వలన అధికారుల పర్యవేక్షణ కరువై కాంట్రాక్టర్ల నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతుంది.
వర్షానికి ఇబ్బందులు..
గత నాలుగు రోజుల్లో నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎస్ఆర్ఎల్ కాలనీలో వరద ప్రవాహం పెద్ద ఎత్తున రావడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాలనీలో బాక్స్ డ్రెయిన్ పనుల కోసం రోడ్డు వెంబడి పెద్ద ఎత్తున గుంతలు తీసి వదిలేశారు. దీంతో వర్షం వచ్చినప్పుడు అక్కడ ఉన్న గుంతల్లోకి వర్షపు నీరు చేరి ప్రమాదకరంగా మారుతుంది. కాలనీవాసులు అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది.
కుంగిన రోడ్డు..
బాక్స్ డ్రెయిన్ నిర్మాణం కోసం తీసిన గుంతలు వర్షానికి పైభాగం కుంగిపోతుంది. తద్వారా అటుగా వెళ్లే వాహనదారులు, పాదచారులు భయాందోళన గురవుతున్నారు. సమస్యను స్థానిక కార్పొరేటర్ నాయికోటి పవన్ కుమార్ దృష్టికి కాలనీవాసులు తీసుకెళ్లారు. సమస్యను పరిశీలించిన కార్పొరేటర్ జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్, కమిషనర్ల దృష్టికి తీసుకెళ్లారు. పనులు త్వరగా పూర్తిచేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆయన అధికారులను కోరుతున్నారు.