5.38లక్షల మంది దివ్యాంగులకు పింఛన్లు

by Nagaya |
5.38లక్షల మంది దివ్యాంగులకు పింఛన్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో5 లక్షల 38వేల మంది దివ్యాంగులకు నెలకు రూ.3016 చొప్పున ఏడాదికి రూ.1850 కోట్లను పెన్షన్ కే ప్రభుత్వం కేటాయిస్తుందని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కె.వాసుదేవరెడ్డి అన్నారు. సరూర్ నగర్‌లోని రంగారెడ్డి జిల్లా రిహాబీటేషన్ సెంటర్లో వివిధ పోటీ పరీక్షలకు సన్నద్దమవుతున్న నిరుద్యోగ దివ్యాంగులకు రూ.35లక్షల స్టడీ మెటరీయల్‌ను గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టపడితే విజయం తధ్యమన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలోని హాస్టల్స్‌లో ఉండే నిరుద్యోగులకు ప్రత్యేకంగా రూ.55 లక్షలతో సీనియర్ అధ్యాపకులచే కోచింగ్ ఇప్పిస్తున్నామన్నారు.

వికలాంగులకు ప్రభుత్వ ఉద్యోగాలలో 4శాతం రిజర్వేషన్ ఉందని, ప్రభుత్వ జాబ్ నోటిఫికేషన్‌లో 3200 ఉద్యోగాలు రిజర్వు అయ్యి ఉన్నాయని స్పష్టం చేశారు. నూరుశాతం సబ్సిడీతో ఉచితంగా ఉపకరాలు అందజేస్తున్నామన్నారు. వికలాంగుల సహకార సంస్థ ద్వారా ఈ ఏడాది ఏప్రిల్లో రూ.24 కోట్లతో 17,000 మందికి సహాయ ఉపకరణాలతో పాటు సబ్సిడీ రుణాలను అందజేశామన్నారు. పోటీ పరీక్షలకు సన్నద్దం అవుతున్న నిరుద్యోగ విద్యార్థులకు స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచితంగా శిక్షణ ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి డీడబ్ల్యూఓ మోతి, వికలాంగుల సంఘాల నాయకులు నారా నాగేశ్వరరావు,పల్లెబోయిన సుధాకర్ వర్మ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed