- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ప్రజాసంగ్రామ పాదయాత్ర రూట్‌లో పోస్టర్ల కలకలం

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ చేపట్టిన నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్రకు స్వాగతం పలుకుతూ బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన బ్యానర్ల సమీపంలో బీజేపీకి వ్యతిరేక పోస్టర్లు దర్శనం ఇవ్వడం కలకలం రేపుతోంది. గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన ఈ పోస్టర్లలో ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపిస్తూ.. వీటికి సమాధానం చెప్పాలని ప్రశ్నల వర్షం కురిపించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో ఈ పోస్టర్లు అతికించడం రాజకీయంగా హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పటికే అనేక సందర్భాల్లో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య ఫ్లెక్సీల వార్ కొనసాగుతోంది. ఈ సారి బండి సంజయ్ పాదయాత్రను టార్గెట్ చేస్తూ పోస్టర్లు అతికించడంపై బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. ఇదంతా టీఆర్ఎస్ కావాలనే చేస్తున్న కుట్ర అని, ఎన్ని ఆటంకాలు సృష్టించినా ప్రజాసంగ్రామ యాత్ర కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు. దీంతో కంటోన్మెంట్ ఏరియాలో ఈ పోస్టర్లు కొత్త చర్చకు దారి తీశాయి. బుధవారం బండి సంజయ్ కేపీహెచ్‌బీ కాలనీలో కార్పొరేటర్లతో కలిసి నడిచారు. నిన్న వీఆర్ఏలపై జరిగిన లాఠీ ఛార్జికి నిరసనగా నల్ల కండువాలు ధరించి సంఘీభావం వ్యక్తం చేశారు.