- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆన్‌లైన్‌లో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్.. యువతే వారి టార్గెట్..

దిశ, బేగంపేట: ఆన్‌లైన్‌లో బెట్టింగ్ నిర్వహిస్తూ ఓ ముఠా అక్రమంగా సంపాదిస్తోంది. ఈ మేరకు సమాచారం రావడంతో రాంగోపాల్ పేట పోలీసులు ఆ ముఠాను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే క్రికెట్ పట్ల ఆసక్తి ఉన్న యువతనే లక్ష్యంగా చేసుకొని వారు తమ ఆన్‌లైన్ బెట్టింగ్ దందాను నడుపుతున్నారని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు ఐదు మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి రూ.15 లక్షల నగదుతో పాటు సెల్‌ఫోన్‌లు, టీవీ స్వాధీనం చేసుకున్నట్లు సెంట్రల్ జోన్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం రాంగోపాల్ పేట్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు నిందితుల వివరాలు వెల్లడించారు.
ఐపీఎల్ మ్యాచ్‌లకు ఆన్‌లైన్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తూ ధనార్జనే ధ్యేయంగా బెట్టింగ్ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. నగర వ్యాప్తంగా గత ఎనిమిది సంవత్సరాలుగా మహేష్ బాబు అనే వ్యక్తి బెట్టింగ్ నిర్వహిస్తున్నాడని అతనికి భూపాల్ యాదవ్, నిఖిల్, ప్రవీణ్, యశ్ కుమార్, నిరంజన్‌లు సహకరిస్తున్నారని పోలీసులు చెప్పారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించి బెట్టింగ్ ముఠాను ఎట్టకేలకు పట్టుకున్నట్లు అడిషనల్ డీసీపీ తెలిపారు. దాడుల్లో పాల్గొన్న ఏసీపీ వేణుగోపాల్ రెడ్డి, రామ్ గోపాల్ పేట్ ఇన్స్పెక్టర్ సైదులు సిబ్బందిని అడిషనల్ డీసీపీ అభినందించారు.