GHMC పరిధిలో మరోసారి బయటపడ్డ నకిలీ సర్టిఫికేట్ల దందా

by Satheesh |
GHMC పరిధిలో మరోసారి బయటపడ్డ నకిలీ సర్టిఫికేట్ల దందా
X

దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ పరిధిలో మరోసారి నకిలీ సర్టిఫికేట్ల దందా బయటపడింది. రెవెన్యూ మున్సిపల్ నకిలీ సర్టిఫికేట్లు తయారు చేస్తోన్న 18 మంది సభ్యుల ముఠాను సైబరాబాద్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. నిందితుల నుండి వేల సంఖ్యలో నకిలీ సర్టిఫికేట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రభుత్వానికి చెందిన వివిధ డిపార్ట్మెంట్‌ల నకిలీ సర్టిఫికేట్లను ఈ ముఠా తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. జీహెచ్ఎంసీ అనుమతుల పత్రాలు, ల్యాండ్ డాక్యుమెంటరి తయారీ, బ్యాంక్ ద్వారా రుణాలు పొందడానికి నకిలీ సర్టిఫికేట్ల తయారు చేస్తున్నట్లు కనుగొన్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed