డ్యూటీ టైంలో లిక్కర్ గ్లాస్ తో ఆఫీసర్.. పోలీస్ బాస్ గుస్సా

by Sumithra |
డ్యూటీ టైంలో లిక్కర్ గ్లాస్ తో ఆఫీసర్.. పోలీస్ బాస్ గుస్సా
X

దిశ, సిటీ క్రైమ్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఓ పోలీస్ కమిషనరేట్ లోని జోనల్ స్థాయి ఉన్నతాధికారి హోదా కలిగిన ఓ ఆఫీసర్ వ్యవహారం పై కమిషనరేట్ పోలీస్ బాస్ గుస్సా అయ్యినట్లు పోలీస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఆ అధికారి విధుల్లో ఉన్నప్పుడు, తన ఆఫీస్ లోనే మద్యం సేవిస్తున్నాడానే ఆరోపణలు రావడంతో పోలీస్ బాస్ క్రమశిక్షణా రాహిత్యం పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అంతే కాకుండా జోనల్ స్థాయి హోదా కలిగిన అధికారి పోలీస్ బాస్ కాన్ఫరెన్స్ లను కూడా సరిగా పట్టించుకోడనే ప్రచారం పోలీస్ వర్గాల్లో జోరుగా జరుగుతుంది. పౌరులకు సేవలు అందించే క్రమంలో పోలీస్ బాస్ సూచనలు, ఆదేశాలు ఇవ్వాలన్నా అందుబాటులో ఉండడని పోలీస్ వర్గాలు అంటున్నాయి.

ఫోన్లు చేసినా స్పందన ఉండకపోవడంతో ఇప్పుడు ఆ అధికారి వ్యవహారం పోలీస్ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా తయారైందని పోలీస్ వర్గాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. కమిషనరేట్ పోలీస్ బాస్ యాక్షన్ తీసుకోవాలి అనుకున్నా ఆ ఆఫీసర్ వెనకాల ఉన్న బ్యాక్ గ్రౌండ్ తో తనను ఎవరు టచ్ చేయరని చిటికలు వేస్తు ప్రభుత్వాన్ని తిడతారని పోలీస్ వర్గాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ఇలా ఈ జోనల్ స్థాయి హోదా కలిగిన అధికారి ప్రవర్తన పోలీస్ వర్గాలను డిస్టర్బ్ చేస్తుందంటున్నారు. ఇలా ఒక అధికారి ప్రవర్తనతో మొత్తం పోలీస్ శాఖ ప్రతిష్టకు నష్టం ఏర్పడే పరిస్థితులు ఉన్నాయన్ని పోలీస్ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.



Next Story

Most Viewed