జయసుధకు ఎన్టీఆర్ జాతీయ జీవిత సాఫల్య పురస్కారం

by Disha Web |
జయసుధకు ఎన్టీఆర్ జాతీయ జీవిత సాఫల్య పురస్కారం
X

దిశ, అంబర్ పేట్ : సహజ నటి జయసుధ అని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ టి.సుబ్బి రామిరెడ్డి అన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా ప్రముఖ సినీనటి జయసుధకు ఎన్టీఆర్ జాతీయ జీవిత సాఫల్య పురస్కారం ప్రదానోత్సవ కార్యక్రమం వంశీ ఇంటర్నేషనల్ ఇండియా, శారద ఆకునూరి (అమెరికా) సంయుక్త ఆధ్వర్యంలో రవీంద్ర భారతీలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుబ్బిరామి రెడ్డి పాల్గొని పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీ రామారావు సినీ, రాజకీయ రంగంలో తన ప్రత్యేకతను చాటుకున్నారని తెలిపారు. ఆయన శత జయంతి సందర్భంగా పురస్కారం అందజేయడం అభినందనీయమన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి పూర్వ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో సినీ దర్శకుడు రేలంగి నరసింహారావు, సినీ నిర్మాత వైవీఎస్ చౌదరి, వంశీ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ వంశీ రామరాజు, వంశీ అధ్యక్షురాలు డాక్టర్ తెన్నేటి సుధాదేవి, మేనేజింగ్ ట్రస్టీ సుంకరపల్లి శైలజ పాల్గొన్నారు. సభకు ముందు ప్రముఖ గాయని ఆకునూరి శారద నిర్వహణలో గాయకులు వినోద్ బాబు, రమణ, వేణు శ్రీరంగం, శశిధర శర్మ ఆలపించిన సినీ గీతాలు అలరించాయి.Next Story