'సీఎం కేసీఆర్ గారు.. మాకు హెల్త్ కార్డుల‌ను మంజూర్ చేయండి'

by Vinod kumar |
సీఎం కేసీఆర్ గారు.. మాకు హెల్త్ కార్డుల‌ను మంజూర్ చేయండి
X

దిశ, ముషీరాబాద్: ఎలక్ట్రిక్ వీల్ చైర్లు ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు ధ‌న్యవాదాల‌ని.. కానీ మాకు హెల్త్ కార్డుల‌ను మంజూర్ చేయాల‌ని తెలంగాణ ముస్కుల‌ర్ డిస్ట్రోఫీ అసోసియేష‌న్ ఆధ్వర్యంలో కండ‌ర క్షీణత బాధితులు డిమాండ్ చేశారు. గురువారం ఇందిరాపార్క్ ధ‌ర్నాచౌక్‌లో వారు ధ‌ర్నా చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ ముస్కుల‌ర్ డిస్ట్రోఫీ అసోసియేష‌న్ అధ్యక్షులు వెంక‌ట్‌రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సదుద్దేశంతో ఎన్నో మంచి పథకాలను సకల జనుల అభివృద్ధికి ప్రవేశపెట్టి అందరికీ లబ్ధి చేకూరుస్తున్నారన్నారు.

రాష్ట్రంలో సుమారు 3,500 మంది కండర క్షీణత వ్యాధితో బాధపడుతున్న వారు ఉన్నార‌న్నారు. వీళ్లంద‌రూ వీల్ చైర్లకే పరిమితం అయిన మాకు షుగర్, బీపీ వంటి మరిన్ని దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయ‌న్నారు. ఇద్దరి సహాయం లేనిది మా పనులు మేము చేసుకోలేమని, కాబ‌ట్టి పది వేల రూపాయల కేర్ టేకర్ అలవెన్స్ మంజూరు చేయాల‌ని కోరారు. అంగన్‌వాడి సెంటర్ల ద్వారా మాకు బలవర్ధకమైన ఆహారం అందించాలని కోరారు. ప్రస్తుతం వికలాంగులకు ఇస్తున్న పెన్షన్ కూడా పెంచాల‌న్నారు.

Next Story

Most Viewed