సారీ అండీ... ఈ వార్తలో నిజం లేదు

by S Gopi |   ( Updated:2022-09-02 02:56:28.0  )
సారీ అండీ... ఈ వార్తలో నిజం లేదు
X

దిశ, వెబ్ డెస్క్: గత కొద్ది రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరంగా ఓ టాపిక్ పై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అదేమంటే... మళ్లీ బీజేపీ, టీడీపీ పొత్తు పెట్టుకోనున్నాయని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. టీడీపీ-బీజేపీ పొత్తుపై వస్తున్న వార్తలు.. జస్ట్ వార్తలు మాత్రమే అందులో నిజం లేదంటూ వివరణ ఇచ్చారు. అయితే, ఏపీలో పవన్ తో కలిసి పోటీ చేయనున్నట్లు, అదేవిధంగా తెలంగాణలో మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తామని ఆయన తెలిపారు.



Next Story