పాతబస్తీలో బీబీకా ఆలం ఊరేగింపు..

by Vinod kumar |
పాతబస్తీలో బీబీకా ఆలం ఊరేగింపు..
X

దిశ, చార్మినార్ : హైదరాబాద్ పాతబస్తీలో మొహర్రం వేడుకలు భక్తి, శ్రద్ధలతో నిర్వహించారు. అంబారీపై బీబీకా ఆలం ఊరేగింపు కార్యకమం చేపట్టారు. చారిత్రాత్మక బీబీకా ఆలం ను ఏనుగు అంబారీ పై ప్రతిష్ఠించి దాని ముందు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా షియాలు విషాద గీతాలు ఆలపిస్తూ.. తమ రక్తాన్ని చిందిస్తూ ప్రగాఢ సంతాపం తెలిపారు. వేలాది మంది షియా సోదరులు ఊరేగింపులో పాల్గొన్నారు. చారిత్రాత్మక బీబీకా ఆలం ను వజ్ర వైడుర్యాలతో అలంకరించి ఏనుగు అంబారి పై ప్రతిష్ఠించారు. బీబీకా అలం నుంచి ఊరేగింపును ప్రారంభించారు. నల్లని వస్త్రాలు ధరించిన షియాలు సంతాప గీతాలు ఆలపిస్తూ దారి పొడవునా యా హుస్సేని.. యా ఆలీ అంటూ చుర కత్తులు, బ్లేడ్లు, తల్వార్లతో తమ శరీరంపై బాదుకుంటూ రక్తాన్ని చిందించారు.


దారి పొడవున భక్తులు బీబీకా ఆలం కు దట్టీలు సమర్పించారు. బీబీకా ఆలం ఊరేగింపు మత పెద్దల ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఊరేగింపుగా ముందుకు సాగింది. బీబీకా ఆలం నుంచి షేక్​ఫైసీ కమాన్, బడా బజార్, యాకుత్​పురా, మజీదే ఇత్తే బార్​ చౌక్, ఆలీజా కోట్ల, సర్దార్​మహల్​మీదుగా చార్మినార్‌కు మధ్యాహ్నం 3 గంటలకు చేరుకుంది. చార్మినార్‌ల వద్ద ఏర్పాటు చేసిన వేదికపై నగర పోలీస్​ కమిషనర్​సివి ఆనంద్, అదనపు కమిషర్​డిఎస్​చౌహాన్, దక్షిణ మండలం డిసిపి సాయి చైతన్యలు పాల్గొని, బీబీకా ఆలం కు దట్టీలు సమర్పించారు.


చార్మినార్​నుంచి ఊరేగింపు గుల్జార్​హౌజ్, ఖద్మె రసూల్​అషుర్​ఖానా వద్దకు చేరుకుంది. పంజేషా, ఎతెబార్​చౌక్, మీరాలం మండి, దారుల్​షిఫా మీదుగా చాదర్​ఘట్​వరకు సాగింది. ఊరేగింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా నగర పోలీస్​కమిషనర్​ సివి ఆనంద్​ఆధ్వర్యంలో భారీ పోలీస్​ బందోబస్తును ఏర్పాటు చేశారు. మీరాలం మండి వద్ద బీబీకా ఆలం ఊరేగింపు వద్దకు మాజీ ఎంపీ అంజన్​కుమార్​యాదవ్, గాజుల అంజయ్య లు బీబీకా ఆలం కు దట్టీలు సమర్పించారు. ఊ‌‌రేగింపులో పాల్గొన్న యువకుల దాహార్తిని తీర్చడానికి పలు స్వచ్చంద సంస్థలు శర్బత్‌తో పాటు మంచినీటిని పంపిణీ చేశారు.



Next Story