- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రంగారెడ్డి కోర్టు లో ఎమ్మెల్సీ కవితకు చేదు అనుభవం

దిశ, ఎల్బీనగర్ : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు చేదు అనుభవం ఎదురైంది. బతుకమ్మ సంబరాల్లో భాగంగా బుధవారం రంగారెడ్డి జిల్లా కోర్టు ప్రాంగణంలో బతుకమ్మ ఆడడానికి కవిత విచ్చేసింది. దీంతో ఒక్కసారిగా న్యాయవాదులు ఎమ్మెల్సీ కవితను అడ్డుకునే ప్రయత్నం చేశారు. న్యాయవాదుల హక్కుల కోసం, క్షణం కోసం.. ఏనాడు ఒక్క మాట కూడా మాట్లాడని కవిత ఏం మొఖం పెట్టుకుని రంగారెడ్డి జిల్లా కోర్టు ప్రాంగణంలో అడుగు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత డౌన్ డౌన్.. కల్వకుంట్ల కుటుంబం నశించాలి అంటూ నినాదాలు చేశారు. బతుకమ్మ సంబరాలలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ కవితను పలువురు న్యాయవాదులు అడ్డుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు న్యాయవాదులను అదుపులోకి తీసుకొని సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు.