- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పనుల్లో నిర్లక్ష్యం సహించేది లేదు.. అధికారులకు ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్..

దిశ,నల్లకుంట: పెండింగ్ ఉన్న పలు అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం గోల్నాక డివిజన్ దుర్గానగర్‌లో పలు శాఖల అధికారులతో కలసి ఆయన క్షేత్రస్థాయిలో పాదయాత్ర నిర్వహించారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. స్థానికులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. కొత్త రహదారి ఏర్పాటులో జాప్యం జరుగుతోందని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా దుర్గా నగర్ అమ్మవారి గుడి ప్రధాన రహదారితో పాటు.. పక్కనే ఉన్న రెండు బస్తీల్లో వెంటనే రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించి నవరాత్రి వేడుకలకు ముందే పనులు పూర్తి చేయాలని ఆయన అధికారులకు సూచించారు.
అధికారులు అభివృద్ధి పనుల్లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఎమ్మెల్యే సాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అధికారులకు,కాంట్రాక్టర్లకు ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, అవసరమైతే ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే చెప్పారు.ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు ఈఈ శంకర్,డీఈ సుధాకర్, ఏఈ ఫరీద్,జలమండలి జీఎం శ్రీధర్ రెడ్డి,మేనేజర్ రోహిత్, వర్క్ ఇన్ స్పెక్టర్ మనోహర్ పాటు బస్తీ నాయకులు పాల్గొన్నారు.