- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
Serilingampally MLA పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుంది
దిశ, శేరిలింగంపల్లి : కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకం ద్వారా మంజూరైన రూ. ఒక కోటి పదకొండు లక్షల పన్నెండు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని సోమవారం లబ్ధిదారులకు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ లబ్ధిదారులకు చెక్కుల రూపేణా అందజేశారు. మియాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శేరిలింగంపల్లి మండలంలోని ఆయా డివిజన్ల పరిధిలోని 111 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని, నిరుపేద ఆడబిడ్డల పెళ్లికి దేశంలో ఎక్కడా లేని విధంగా మానవతా దృక్పథంతో కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి ఆర్ ఐ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘునాథ్ రెడ్డి, బాలింగ్ గౌతమ్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్, అన్వర్ షరీఫ్, గంగాధర్, ప్రసాద్, చంద్రిక ప్రసాద్ గౌడ్, సుప్రజ, లబ్ధిదారులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.